2008కి భాండాగారం
మూలము, heart, mind, moolamu, route cause
In జ్ఞానము on నవంబరు 7, 2008 at 7:09 అపరాహ్నం
ఆలోచన అన్ని సమస్యలకు, అన్ని అనందాలకు మూలము.ఈ ఆలోచనను మనము మనసు అని పిలుస్తాము. మనసు మంచిదయితే హ్రుదయము అని పిలుస్తాము. అంటె మంచి ఆలోచనలను హ్రుదయము అనవచ్చు.ఆలోచనలను రెండు రకాలుగా గుర్తించవచ్చు.మంచి మరియు చెడు ఆలోచనలు.
మనము ఏదయినా సమస్యతో భాదపడుతున్నాము అంటె …దానికి సంభందించిన చెడు లేక -ve ఆలోచన నమ మెదడులో లేక శరీరములో ఉందన్నమాట. దీన్ని ధ్యానము లో తొలగిస్తే మీసమస్య చిటికెలో పరిష్కారమవుతుంది.మనసును శుభ్రము చేసుకొని ప్రయంతించండి.
మనము సమస్య తొలగించుకోవడానికి దైవదర్శనము, సత్గురు దర్శనము , పూజలు మొదలైనవి చేస్తాము. ఎప్పుడైతే మీకు నమ్మకము కలిగిందో మీలో ఉన్న ఆ సమస్యకు సంభందించిన చెడు ఆలోచన లేక -ve తొలగి మీసమస్య పరిష్కార మవుతుంది.
మంచి ఆలోచనలను హ్రుదయము అని పిలస్తే చెడు ఆలోచనలను మనసు అని పిలవాలి.చిత్రమేమంటె అన్నిఆలోచనలను మనము మనసు అని పిలుస్తాము. మనకు హ్రుదయము గురించి తెలియదు.
మంచి ఆలోచనలు మనము పెంచుకోకపోతే ..చెడు ఆలోచనలు పెరిగిపోయి మల్లీ రావణుడు , దుర్యొధనుడు..పుడతాడు. ఆ చెడు శక్తిని పూర్తిగా తొలగించడానికి భగవంతుడే మానవరూపము ధరిస్తాడు.
మనము రోజు శరీరము శుభ్రము చేసినట్లే మన్సుని శుభ్రము చేసి హ్రుదయంగా మార్చాలి. లేకుంటె మనమే రవణావతారమెత్తుతాము.
చెడు ఆలోచనలౌ లేనివారే ఆత్మస్తితిలోనివారు.వారే భగవంతుని అవతారులు. భగవంతుడు ఎక్కడో లేడు ఇక్కడే మన హ్రుదయము లోనే ఉన్నాడు.విశ్వము భగవంతుని శరీరము .ఆ శరీరములోనే మనమున్నాము.మనము హ్రుదయంగా మారటమే మన లక్శ్యము.
Miracles
In జ్ఞానము on నవంబరు 3, 2008 at 2:59 అపరాహ్నం
భగవంతుడు పరిచయమైతే మనకు అన్నీ అద్భూతాలుగానే కనిపిస్తాయి.
మన శరీరము ఒకా ఆద్భుతము. ఆందులో జీవము ఒక ఆద్భుతము.విశ్వము ఒక అద్భుతము. ప్రాణశక్తి అద్భుతము. ఇలా అద్భుతము కానిదేదీ లేదు.
మనముగా చేసే పనులు కాకుండ , మనవల్లకాని పనులను ఎవరైనా చేస్తే అవి అద్భుతాలుగా మనము చూస్తాము. కాని స్రుష్టి లో , మనలో తొంగి చూస్తే ఉన్న అద్భుతాలను మనము గమనించము. ప్రక్రుతిని, దేవున్ని ప్రేమిస్తే అద్భుతాలు కానివేవి మనకు కనిపించవు. మనము మాట్లాడడము అద్భుతము కాదా? శ్వాస ఆద్భుతము కాదా? గుండె కొట్టు కోవడము అద్భుతము కాదా? భూమి అద్భుతము కాదా? సూర్యుడు అద్భుతము కాదా? ప్రాణశక్తి అద్భుతము కాదా?
ఇన్ని అద్భుతాలు చేస్తున్న దేవున్ని మాత్రము గుర్తించము.
ఇలా గుర్తించక పోవడానికి – మనసు , బుద్ది కారణము. ఇంతకు ముందు జాబుల్లో చెప్పాను, మనసు అంటే చెడు ఆలోచనలు , బుద్ది అంటే ఆజ్ఞానము. మనశరీరాన్ని శుభ్రము చేస్తున్నట్టె మనసుని శుభ్రము చేయాలి, బుద్దిని శుభ్రము చేయాలి.(ఇటీవలి జాబులు చూడండి)
మనసు శుభ్రము చేస్తే హ్రుదయము మిగులుతుంది. బుద్దిని శ్భురము చేస్తే ఆనందము మిగులుతుంది. అప్పుడె ప్రక్రుతి, దేవుని అద్భుతాలు మనము చూడగల్గుతాము.
Click here for English Weblog – edivinity.wordpress.com
Deepavali, Lashmi devi
In జ్ఞానము on అక్టోబర్ 28, 2008 at 10:41 అపరాహ్నం
దీపావళి శుభాకాంక్షలు.
మన పురాణాలలో త్రిమూర్థులు బ్రహ్మ , విష్ణు , మహేశ్వరుడు వారి భార్యలు సరస్వతీదేవి, లక్ష్మిదేవి , పార్వతిదేవి.
మనకున్న మూడు శరీరాలు- భౌతిక, సూక్ష్మ, కారణ శరీరాల లాగనే, తండ్రి అయిన భగవంతుడిని మూడు ప్రపంచాలు- భౌతిక, సూక్ష్మ, కారణ ప్రపంచాలని ఆయనకున్న మూడు శరీరాలుగా గుర్తించాలి.వీటినే భగవంతుడి సకారరూపాలుగా మనము గుర్తించాలి. వీటినే శరీరము , మనసు, బుద్ది అని గత పుటల్లో తెలుసుకొన్నాము. ఈ సకారరూపాలనే పార్వతిదేవి, లక్ష్మిదేవి, సరస్వతీదేవి గా మన ఋషులు వర్ణించారు. కనిపించే భౌతిక ప్రపంచము(UNIVERSE) పార్త్వతీదేవి రూపము, ప్రపంచాన్ని నడిపిస్తున్న డబ్బు (MONEY) లక్ష్మీదేవి రూపము , విజ్ఞానము(SCIENCE) సరస్వతీదేవి రూపము.
మనకున్న మూడు శరీరాలకు శక్తి నిస్తున్న- కుండలిని, హ్రుదయము, ఆత్మ లాగానే , తండ్రి అయిన భగవంతుడిని మూడు ప్రపంచాలకి శక్తి నిస్తున్న- భౌతిక శక్తి , ప్రేమ , ఆనందము లను మహేశ్వరుడు, విష్ణు , బ్రహ్మ లుగా మన ఋషులు వర్ణించారు.
ఈ దీపావళి రోజు మనము లక్ష్మీ దేవిని పూజిస్తాము. అంటే తండ్రి అయిన పరమాత్మ సూక్ష్మరూపాన్ని ధ్యానిస్తూ మన సూక్ష్మరూపమయిన మనసు లేక చెడు ఆలోచనలను తొలగించుకోవడనికి మనము ప్రయత్నము చేయాలని గుర్తుచేసుకొంటాము. భగవంతుని సూక్ష్మరూపమయిన లక్ష్మీ దేవిని ఆశీర్వదించమని కోరుకొంటాము.
Click here for English Weblog – edivinity.wordpress.com
ఆత్మ స్థితి, ఆలోచనలు, తత్వము, దివ్యత్వము, దేవుల్లు, tatvamu
In జ్ఞానము on అక్టోబర్ 26, 2008 at 10:15 అపరాహ్నం
మనిషి తత్వము మరియు దేవుడి తత్వము రెండూ అర్థము చేసుకోవాలి. అప్పుడె మనిషి , దేవుడు రెండింటికి అర్థము భోధపడుతుంది.
మనము మనసుతో పనిచేస్తాము కాబట్టి మనుషులము. మనసులేకపోతే దేవుడు. శరీరములో మనసు ఉంటే మనిషి , శరీరములో మనసు లేకపోతే దేవుడు.
మనసు అంటే అలోచనలు, ముఖ్యంగా చెడు ఆలోచనలు. చెడు అలోచనలను ఆపెయ్యగలిగితే మనము దివ్యత్వము పొందుతాము. దేవుడవుతాము. మంచి ఆలోచనలు ఉన్నా నష్టము లేదు కనుక మంచి ఆలోచనలు ఉన్నవాల్లను కూడ మనము దేవుడు అంటాము. అంటే దేవుడంటే మనిషినుండి మార్పుచెంది దేవుడిగా మారిన(ది)వాడు.
దేవుల్లు అంటే -
1. చెడు ఆలోచనలు లేనివాళ్ళు మరియు మంచి ఆలోచనలు ఉన్నవాళ్ళు. దీనినే ఆత్మ అంటాము. మనిషి ఈ స్థితిలో ఉంటే ఆత్మ స్థితి. ఇదే ఆత్మ తత్వము.
2. ఎలాంటి ఆలోచనలు లేని వాళ్ళు . దీనినే పరమాత్మ అంటాము. మనిషి ఈ స్థితిలో ఉంటే పరమాత్మ స్తితి. దీనినే యోగశాస్త్రములో సమాధి స్థితి అన్నారు. ఇదే పరమాత్మ తత్వము.
మనిషి దేవుడుగా మారటము , తిరిగి దేవుడు ప్రపంచము స్రుష్టించి (తనే ప్రపంచముగా మారి ) మనిషులుగా రూపము పొంది దేవుళ్ళు గా మారటము. ఈ దేవుళ్ళు తిరిగి ఒక్కొక్క ప్రపంచము స్రుష్టించి (ఒక్కొక్క ప్రపంచముగా మారి ) మనిషులుగా రూపము పొంది దేవుళ్ళు గా మారటము. లెక్కలేనన్ని ప్రపంచాలు , ఒక్కో ప్రపంచనికి ఒక్కొ దేవుడు. ఒక్కో దేవుడికి ఒక్కో ప్రపంచము.
Click here for English Weblog – edivinity.wordpress.com
ఫ్యామిలీ, family, Relationships
In జ్ఞానము on అక్టోబర్ 23, 2008 at 12:28 అపరాహ్నం
‘ఫ్యామిలీ’ కి పొడగింపు(Continued from lastpost) ….
ఒక ఫ్యామిలీ లో ఇద్దరు అక్క చెల్లెలు, మరియు ఒక అన్న. ఇద్దరికీ పెల్లిలు అయి పోయయి. అన్న అమెరికా వెళ్ళి సంపాదించుకొని ఇందియా తిరిగివచ్చి పెల్లిచెసుకొన్నాడు. అప్పుడే వాల్లింటిలో మనస్పర్దలు ప్రారంభము. అన్న సంపాదించి మకేమి ఇవ్వలేదని అక్కచెల్లెల్లు అతనిపై కోపము పెంచుకొని , అతని డబ్బును సొంతము చేసుకోవడానికి వేరే మార్గాలను అన్వేషిస్తున్నారు. వారికి అతను అమెరికాలో ఇన్సురెన్సు పెద్దమొత్తములో ఉందని తెలిసి వాల్ల బుద్దిలో అజ్ఞానము ప్రవేశించి చెడు ఆలోచనలకు దారితీసింది. ఆ ఆలోచనల ప్రభావము వలన ఆ ఇంటిలో మార్పులుచేయడము , అన్న ఆక్సిడెంటులో మరణించడము , ఇన్సురెన్సు డబ్బులు అక్క చెల్లెల్లు పంచుకోవడము జరిగిపోయింది. ఇదంతా మూడునెలలలో పలనే ఈ దురధ్రుష్ట సంఘటన జరిగిపోయింది.
అక్కచెల్లల్ల చెడు ఆలోచనల ఫలితంగా , వాల్ల ఇంటిలో మార్పులు జరిగి ఫలితాలు కనపడ్డాయి.
తండ్రి అయిన దేవుడు తన భాధ్యత అంతా తల్లి అయిన ప్రక్రుతికి అప్పచెప్పి తను నిమిత్త మాత్రుడుగా ఉంటాడు. తల్లి అయిన ప్రక్రుతి మన ఆలోచనలు ద్వారా మార్పుచెంది మనకు తగిన ఫలితాలు ఇస్తుంది. ఇక్కడ మన ఆలోచనలే అన్నింటికీ మూలము అని తెలుస్తుంది. అందుకే మన మన్సుని మంచి ఆలోచనలతో నింపి చెడు ఆలోచనలను ని దూరము చేసి , మనసుని రోజూ శుభ్రము చేద్దాము.
Click here for English Weblog – edivinity.wordpress.com
devotion, dislike, family, family relations, hate, kauravulu, love, mind and heart, mind on family, pandavulu, Relationships, worship
In జ్ఞానము on అక్టోబర్ 20, 2008 at 6:04 అపరాహ్నం
ఆలోచనలు రెండు విధాలు, అవి మంచి ఆలోచనలు మరియు చెడు ఆలోచనలు అని చెప్పాను. మంచి ఆలోచనలలో ప్రేమ గుణము మాత్రమే ఉంతుంది, పాండవుల్లాగ. చెడు ఆలోచనలలో ప్రేమ గుణము ఉండదు మరియు దుర్గుణాలు లెఖ్ఖలేనన్ని, కౌరవుల్లాగ.
చెడు ఆలోచనలనే మనసు అని , మంచి ఆలోచనలను హ్రుదయము అని పిలుస్తాము. ఈ మనసుని ( చెడు ఆలోచనలను ) రోజూ హ్రుదయము ( ప్రేమ ) తో శుబ్రము చేసుకొని మనసుపై విజయముసాధించాలి. ఇంతకుముందు పుటల్లో నేను చెప్పాను, మన శరీరము రోజూ శుబ్రము చేయడము ఎంత అవసరమో , మనసుని ( చెడు ఆలోచనలను ) తొలగించివేయడము కూడా అంతే అవసరము. గమనించండి , దుర్యోధనుడిని ( మనసుని) మార్చడము క్రిష్నుడి వల్లనే కాలేదు, వాడు ( మనసు ) చావవలసిందే. చెడు ఆలోచనలను తొలగించివేయడము అంటే మనసు చనిపోవడమే, మనసు లేకపోతే హ్రుదయము (ప్రేమ) మాత్రమే మిగులుతుంది. ఇదే భగవంతుడు.
దేవుడు అంటే శక్తి, ప్రేమ మరియు ఆనందము. మనలో ఇవి ఎంత ఎక్కువగా ఉంటే మనము భగవంతునికి అంత దగ్గరగా ఉన్నట్టు. మనము చేయవలసిందల్లా మన మనసుని రొజూ శుభ్రము చేసుకోవడమే. భగవంతుడు తనకు తానుగా మన హ్రుదయములో ప్రత్యక్షమవుతాడు.
మనసు ప్రభావము ఫ్యామిలీలోని వారిపట్ల ఎంత తీవ్ర ప్రభావము చూపి, ఎన్నో దురద్రుష్ట సంఘటనలకు కారణమవుతుందో తరువాత ఇక్కడ , ఒక సంఘటన నేను మీకు వివరిస్తాను.
ఇంకావుంది…
Click here for English Weblog – edivinity.wordpress.com
Relationships, science of mind, spirituality
In జ్ఞానము on అక్టోబర్ 17, 2008 at 11:57 అపరాహ్నం
మన మనసును శుభ్రంచేసుకోకపోవడము వలన , మన సంబంధీకుల మధ్య బంధుత్వాలలో మనస్పర్దలు కలుగుతాఇ. మన చెడు ఆలోచనల ప్రభావమువలన , మనచుట్టూ మన ఇంటిలో , ప్రక్రుతిలో మార్పులు జరిగి (దీనినే మన ఋషులు వాస్తు శస్త్రముగా అభివ్రుద్దిచేసారు) మన చుట్టు ఉన్న వారితో , మన స్నేహితులతో , చుట్టాల్తో సంభధాలు దెబ్బతింటాయి .
ఇక్కడ ఒక భార్యభర్తల మధ్య వైవాహిక సంభంధములో వచ్చిన మనస్పర్దలు అది ఎలా ఇంటిలో మార్పు కు కారణమైందో మరియు ఎలా పరిష్కరించబడిందో వివరిస్తాను.
అమ్మాయి పెల్లికి ముందునుచీ కాబోయె భర్త పై తనకు , తనకు తనభర్తకు సఖ్యత ఉండదని , గొడవలౌతాయని ఓహించుకొంటూ , తన ఫ్రెండ్సు తో , తల్లిదండ్రులతో ఇదే విషయము పదేపదే ప్రస్తవిసూ ఉండెది. దీనికి కారణము అడిగినప్పుడు తను చూసిన కొందరు పెల్లైన వారు గొడవలుపడి వేరుపడి విడాకులు తీసుకోవడము అదిచూసి తనకు అలాగే అవుతుందని ఉహించుకోవడము ప్రారంబించింది. పెల్లైన తరువాత అది బలపడి అమె భర్తను అనుమానించడము, అతను చిన్నగ గొడవపడిన కూడ అది పెద్ద గొడవగా ఉహించుకోవడము, తల్లిదంద్రులకు చెప్పడము వారుసర్దిచెప్పడము జరిగేది. కాని ఇలాగే అమెమన్సులో అనుమానము తొలగక పోవడమువలన , ఈమె చెడు ఆలోచనల వలన వారు ఇల్లు మారడము , ఆ ఇంట్లో నైరుతి మూలలో మరుగుదొద్ది ఉండడము వారు విడాకులవరకు వెల్లారు.
నేను వారిని కలిసి అమె మనసుని శూభ్రముచేసుకొవడము తెలిపి నప్పుడు , ఫలితము త్వరితంగా కనపడి వారు కలవడము వారు ఇల్లుమారడము తిరిగి సంతోషముగా ఉండడము జరిగింది.
మనసుని శుభ్రముచేసుకోవడానికి నేను ఆమెకు మొదటి పద్దతిలో (శుభ్రము – చూడండి) అనగా ధ్యానములో కూర్చొని అమెలోని వివాహము, భర్తకు సంభందించిన చెడు అలోచనలను గుర్తుకుతెచ్చుకొని వటిని అనుభవిస్తూ , వాటిలోని నిజలను గ్రహిస్తూ ఒక్కొక్కటి తొలగిస్తూ మనసులో అవితొలగిపో యే వరకు సాధన చేసింది. అధ్భుతము జరిగింది.
Click here for English Weblog – edivinity.wordpress.com
ways to divine, ways to spirituality
In జ్ఞానము on అక్టోబర్ 16, 2008 at 8:41 అపరాహ్నం
గత పుటల్లో నేను చెప్పాను, మంచి పనులు(సత్కర్మలు చేయడము, శకాహారము) వలన తల్లి అయిన ప్రక్రుతిని గురించి తెలుసుకోవలని ఆసక్తి పెరుగుతుంది. మీ అధ్యాత్మిక ప్రయాణము జ్ఞానమార్గములో ప్రవేశిస్తుంది.
ఇప్పుడున్న కాల పరిస్తితులలో నూటికి టొంభైతొమ్మిది మనుషులు కర్మ మార్గము మాత్రమె పరిచయ మైనవారు. మిగతా ఒక శాతము జ్ఞానము , భక్తి పరిచయమైనవారు.
మీకు ఇప్పుడు నేను చెప్పేవిషయాలు చదవాలనే ఆసక్తి కలిగితే , ఇంకాతెలుసుకోవాలని మీ కనిపిస్తే మీరు సత్కర్మలు లేక , శాకహారము ఏదో ఒక జన్మలో ప్రారంభించినవారే. జ్ఞానము సాధన తీవ్రమైతే దేవుడు మాత్రమే సత్యము మరియు శశ్వతము అని , మిగతా అన్నీ ఆసత్యాలు మరియు అశశ్వతము అని గ్రహిస్తారు. దీనినే భక్తి అనవచ్చు. భక్తి అనేది ప్రేమకు పరాకాష్ట . తల్లి అయిన ప్రక్రుతి పట్ల గాని, తండ్రి అయిన దేవుని పట్ల గాని ప్రేమ లేకుండా మనము సత్కార్యాలు , శాకహారము మొదలుపెట్టలేము. సత్కార్యాలు , శాకహారము మొదలుపెట్టితే గాని జ్ఞానము పై ఆసక్తి కలిగి భక్తికి దారితీయదు. ఇప్పుడు చెప్పండి భక్తి ముందా , కర్మ ముందా? ఇది కోడి ముందా , గ్రుడ్డు ముందా అన్నట్లు ఉంటుంది.
సత్యమేమంటే , ఇవి రెండు కాదు ఆనందము మత్రమే ముందు. ఆనందమే ఆత్మ. విశ్వమే తనై తను మాత్రము ఆనందస్తితిలో ఉంటే ఆత్మ.
ముందు ఆకరములేని(నిరాకారము) , గుణములేని(నిర్గునము) అయిన పరమాత్మ మత్రమే ఉన్నాడు. ఇది పరమాత్మ. ఈ స్తితిలో ఎలాంటి గుణము లేన్నందున మన ఋషులు ఆత్మనే పరమాత్మ గా వర్ణించారు. ఇదీ స్రుష్టి క్రమము.
Click here for English Weblog – edivinity.wordpress.com
In జ్ఞానము on అక్టోబర్ 15, 2008 at 5:28 అపరాహ్నం
‘శుభ్రము 3’ కి పొడగింపు(Continued from lastpost) ….
సత్కర్మలు చేయడము వలన దేవుని గురించి తెలుసుకోవాలని, ప్రక్రుతి రహస్యాలు తెలుసుకోవాలని , వేదాలు, ఉపనిషత్తులు , పురాణలు , భగవత్గీత, రామాయణము , బైబిలు, ఖురాను లాంటి గ్రంధాలు చదవలని ఆసక్తి పెరుగుతుంది. ఇదీ మనం జ్ఞాన మార్గములో ప్రవేషిస్తున్నాము అనటానికి సూచన. జ్ఞానము కోసము సత్గురువులను ఆశ్ర యించడము , సత్సంగాలు వినడము, జ్ఞానము లభించదము వలన భక్తి కలగడము , తిరిగి సత్కర్మలు సాధన ..ఇలా కర్మ జ్ఞాన , భక్తి మార్గములు ఒక దానికి ఒకటి సంబంధము కలిగి , మన సాధనలో భాగమై మనని సత్ చిత్ ఆనందము లేక పరమాత్మస్తితి వైపు తీసుకొని వెల్లు తాయి.
ఈ మార్గము మొదలయిన తరువాత మన గమ్యము చేరడము ఎన్ని జన్మలు అనేది దేవుడికి మనకు ఒకరికి ఒకరిపై ఉన్న భక్తి ప్రేమల పై ఆధారపడి ఉంటుంది. ఒక జన్మలో అగిపోయిన సాధన , తరువాతి జన్మలో తిరిగి అక్కడి నుంచి ప్రారంభమై చివరి జన్మలో భక్తి మాత్రమే మిగిలి జన్మరాహిత్యము (తిరిగి జన్మ లేని స్తితి) కలిగి పరమత్మాస్తితిలో ఉండవచ్చు . తిరిగి భగవత్ కోరిక పై ఒక ప్రత్యేక ఆధ్యత్మిక కార్యక్రమము కోసము ఈ భూమిపై జన్మ ఎత్తవచ్చు . వీరు కారణజన్ములు. గమనించండి – శ్రీరాముడు, క్రిష్ణుడు, అల్లా, జీసస్ , సాయి , రామక్రిష్ణ పరమహంస , రమన మహర్షి , ఇలా ఎందరో పరమాత్మస్తితి పొందినవారు, కారణజన్ములు , మార్గదర్షకులు, మనకి సత్యాన్ని గుర్తు చేసి సాధన చేయించే సత్గురువులు.
అందరికీ పాదాభివందనములు.
కర్మ, జ్ఞాన, తీర్థయాత్రలు, భక్తి
In జ్ఞానము on అక్టోబర్ 14, 2008 at 8:16 అపరాహ్నం
‘శుభ్రము 2’ కి పొడగింపు(Continued from lastpost) ….
బుద్ది శుద్ది చేయడము కర్మ, జ్ఞాన , మరియు భక్తి మార్గముల ద్వారా సాధ్యము. వీటిని మూడింటిని ఒకదానితో ఒకటి కలిపి చూస్తేనే సాధన పరిపూర్ణము అవుతుంది. టూకీగా చెప్పాలంటే – సత్కర్మలు చేయడమువలన , జ్ఞానము నందు ఆసక్తి కలుగుతుంది, జ్ఞానము వలన బుద్ది శుద్ది అయి భక్తి కలిగి మోక్షమునకు (సత్ చిత్ ఆనందస్తితి లేక పరమాత్మ స్తితికి ) దారితీస్తుంది.
కర్మ – మార్గము అంటే సత్కర్మలు చేయడము. సత్కర్మలు అంటే మంచి కర్మలు. దేవునిపై విశ్వాసము , మనుషులపై , జంతువులపై, పక్షులపై, సర్వ ప్రక్రుతిపై ప్రేమ మాత్రమే (ద్వేషము లేని) కలిగిఉండడము. గమనించండి – తండ్రి అయిన దేవుడు(నిరకారము) మరియు తల్లి అయిన ప్రక్రుతి ( సకారము ) మనకు , జీవులన్నింటికి కావలసినవని ఇస్తూ కూడ మననించి ప్రేమ మాత్రమే ఆశిస్తారు. ఇలాంటి ప్రేమనే మనము దేవునిపై , ప్రక్రుతిపై , సర్వ ప్రాణులపై ప్రకటించాలి. ఇదే కర్మ మార్గము. భగవంతుని ప్రార్థించడము , పూజలు చేయడము , తీర్థయాత్రలు చేయడము వీటిలో భాగమే. ఇలాంటి సత్కర్మలు మనము తప్పక చేయాలి . వీటివల్ల జ్ఞానము పై ఆసక్తి కలుగుతుంది. ఆధ్యాత్మిక మార్గములో సత్కర్మలు మనము వేసే మొదటి అడుగులు.
ఇంకావుంది(Continued )…
Click here for English Weblog – edivinity.wordpress.com
అజ్ఞానము, గర్వము, జ్ఞానము, పొగరు, ప్రక్రుతి
In జ్ఞానము on అక్టోబర్ 13, 2008 at 6:31 అపరాహ్నం
‘శుభ్రము’ కి పొడగింపు(Continued from lastpost) ….
బుద్ది అంటే జ్ఞానము , అజ్ఞానము రెండు విధాలు.
అజ్ఞానము – అంటే గర్వము, పొగరు etc… అజ్ఞానము వలన బుద్ది మూర్ఖంగా ప్రవర్తిస్తుంది. దేవుని కి సంభంధించిన, ప్రక్రుతికి సంభంధించిన విషయాలపట్ల అవగాహన పెంచుకోవడానికి ఇష్టపడదు. బుద్దిని శుభ్రము చేయడానికి జ్ఞానము అవసరము.జ్ఞానము – అనగా మన గురించి, కనిపించే ప్రపంచం గురించి, కనిపించని ప్రపంచం గురించిన సత్యము. ఎంతో విలువైనది. దీనినే దేవుడు అని మనం పిలుస్తాము. ఈ జ్ఞానము మీకు లభిస్తే మీ బుద్ది శుద్ది అయి అజ్ఞానము తొలగి ఆనందము మీ సొంత మౌతుంది.
బుద్ది ని శుద్ది చేసుకొవడానికి లేక జ్ఞానము సంపదించదానికి సాధన అవసరము. ఈ సాధన మనకు తెలియకుండానే తండ్రి అయిన భగవంతుడు , మన తల్లి అయిన ప్రక్రుతి ద్వారా మనతో చేయిస్తూనే ఉంటాడు. మనని జ్ఞానము వైపు నడిపిస్తూనే ఉంటాడు.
గమనించండి – మనకు వచ్చే కష్టాలు, దుఃఖాలు మనకు తండ్రి వేస్తున్న పరిక్షలు. మనలో వైరాగ్యము పెంచి జ్ఞానముపై ఆసక్తి కలిగేల చేయడము. అదె ఆ తండ్రి కి ముఖ్యమైన పని. ఒక పసిపాపపై తల్లి తండ్రి ప్రేమిస్తూ పెంచి , మంచి విధ్యాబుద్దులు నేర్పి తమకంటే గొప్పవాల్లను చేయాలని చూస్తారు. ఇదే తల్లి అయిన ప్రక్రుతి , తండ్రి అయిన భగవంతుడి తత్వము.
ఇంకావుంది(Continued )…
Click here for English Weblog – edivinity.wordpress.com
కామ, క్రోధ, చెడు ఆలొచనలు, బ్రహ్మముహూర్థము, మంచి ఆలొచన, మత్సరాలు, మద, మోహ, లోభ, హ్రుదయము, subconcieous mind
In జ్ఞానము on అక్టోబర్ 11, 2008 at 4:54 అపరాహ్నం
గత పేజీలలో మనకు మనకున్న మూడు శరీరాలగురించి వివరించాను.
మనము మన భౌతిక శరీరమును ఎలాగ రోజు స్నానము తో శుభ్రము చేసుకొంటామో , మిగత రెండు శరీరాలను (1.సూక్ష్మశరీరాము లేక మనసు 2.కారణశరీరాము లేక బుద్ది) కూడ రోజు తప్పనిసరిగా శుభ్రముచేసుకోవాలి వీలైతే మూడు సార్లు లేక కనీసము ఒక సారైనా బ్రహ్మముహూర్థములో(4.30AM to 5.30AM).
మనసును , బుద్దిని శుభ్రము చేయడము ప్రపంచాధిపతి కావడంకన్నా కష్టమైనపని. మన మనసు,బుద్ది శుభ్రము మనవల్లనే సాధ్యము. గమనించండి – ధుర్యోధనుని మార్చడానికి క్రిష్ణుని వల్లనే కాలేదు. రావణుని మార్చడానికి రాముని వల్లనే కాలేదు. అందుకే మన మనసుని మనమే శుభ్రము చేసుకోవాలి.
మనసు అంటే ఆలొచనలు. ఆలొచనలు రెందు రకాలు మంచి(+ve) మరియు చెడు(-ve).
మంచి ఆలొచన అంటె హ్రుదయము. ఇక్కడ ప్రేమ మాత్రమే ఉంటుంది.
చెడు ఆలొచనలు – కామ , క్రోధ, లోభ , మోహ , మద , మత్సరాలు మరియు తోడుగ వంద వరకు ఉన్నాయి. చెడులు అన్నీ తెలుసుకొని తొలగించుకోవదము కష్టమైన పని. రెండు పద్దతులు వివరిస్తాను.
1.ధ్యానములో మీలో వస్తున్న , గత సంఘటనలకు సంభంధించిన, భాధలు,సమస్యలు , ఆలోచనలను తప్పించుకోవడానికి ప్రయత్నించకండి. వాటిని స్వాగతించి వాటిలో మమెకమై వాటిలోని నిజాలను , తప్పులను గమనించి అనుభవములోనికి తెచ్చుకోండి. అవి వాటంతట అవేతొలిగిపోయేవరకు వాటి అనుభవములో గడపండి. భాధాకరన సంఘటనలు మిమ్మలిని ఏడ్పిస్తాయి. తరువాత అవి క్రమంగా తొలిగి ప్రాశాంతత ఏర్పడు తుంది.తిరిగి ఆ ఆలోచన మీ మదిలో ఇంక ఎప్పడికి రాదు.
2. మనం ధ్యానములో మంచి – సర్వ ప్రానులపట్ల ప్రేమ , దేవునిపట్ల ప్రేమ ఉందా , ఎంత ఉంది అని గమనించాలి. ఇది పెంచుకోవదానికి ప్రయత్నించాలి. మన శరీరా శుభ్రతకు సబ్బు,నీల్లు ఎలాగొ , మనసుని శుభ్రము చేయడానికి ప్రేమ అవసరము. మంచి మీలొ పెరిగినాకొద్దీ చెడు దూరమైపోతుందీ.మీ మనసు దివ్యత్వము సంతరించుకొంటుంది.
మీ మనసులో మంచి ఏర్పడి చెడు తొలగిపోవదము వలన మీ సమస్యలు వటంతట అవే తొలగి పోవటము మీరు చూస్తారు. ఎందుకంతే మీలో ఉన్న ఆ ఆలోచనలే (subconcieous mind) మీ చుట్టూ ఏర్పడే పరిస్తితులకు కారణము. గమనించండి – ఆలోచనలే గట్టిపడి భౌతిక పదార్థముగ కనపడుతోంది.
ఇంకావుంది(Continued)….
Click here for English Weblog – edivinity.wordpress.com
అక్షము, ఆకాశము, ఆనందము, గాలక్సీలు, గ్రహాలు, నక్శత్రాల, నక్శత్రాలు, ప్రేమ, భ్రమణం, లోన, వేడి, Big Bang theory, happiness, heat, Inside, love, space, unknown
In జ్ఞానము on అక్టోబర్ 10, 2008 at 6:59 అపరాహ్నం
విశ్వము లో 1.వాక్యూం* లేక తరంగాలు(భ్రమణం లేనివి) మరియు 2.పదార్థములు (భ్రమణం ఉన్నవీ) అనే రెండు ఉన్నాయి.
ఇక్కడ గాలక్సీలు లేక నక్శత్రాల సమూహముఒక పదార్థము(భ్రమణం ఉన్నవీ) అనుకొంటే , ఇది తన చుట్టూ తాను ఒక అక్షము(unknown(భ్రమణం లేని) చుట్టూ తిరుగుతూ ఇంకొక అక్షము(as per science it is unknownభ్రమణం లేని) చుట్టూ తిరుగుతూ , విస్తరిస్తున్నాయి(Big Bang theory).
ఇలంటి గాలక్సీల్లో మన సూర్య మండలము ఉన్న మిల్కీవే గలక్సీ ఒకటి. ఇందులొ సూర్యుడు ని వాక్యూం (భ్రమణం లేనివి) అనుకుంటే గ్రహాలను పదార్థములు (భ్రమణం ఉన్నవీ) అనుకోవచ్చు.
ఇది వెలుపల మనకు తెలిసింది. ఇక లొపలకు వస్తే పదార్థలు అన్ని కూడ పరమాణువులతో ఏర్పడ్డవి. పరమాణువులో ప్రోటాను (భ్రమణం లేనివి) మరియు ఎలక్ట్రాను (భ్రమణం ఉన్నవీ). దీన్ని బట్టి బయట విశ్వములో ఏలాంటి నిర్మాణము ఉందో విశ్వము లొపల ఆలాంటి నిర్మాణమే ఉంది.
ఇక్కడ భ్రమణం లేనివి +ve గా, భ్రమణం ఉన్నవీ -ve గా అనుకొందాము. విశ్వానికి కారణము +ve మరియు -ve అని గుర్తించాలి.
ఇక మనని మనము గమనిస్తే ద్వైతము(రెండు) భాగాలుగా కనిపిస్తుంది. మగ మరియు ఆడ, మంచి ఆలొచనలు మరియు చెడు ఆలొచనలు, జ్ఞానము మరియు అజ్ఞానము. అనందము మరియు దుఃఖము ఇల అన్నింటిలో ద్వైతము కనిపిస్తుంది.
ఇక్కడ ఆడ,చెడు,అజ్ఞానము వేటిని భ్రమణం ఉన్నవీ గా గుర్తిస్తే , మగ, మంచి,జ్ఞానము భ్రమణం లేనివి గుర్తించాలి. భౌతిక శరీరానికి, మనసుకి(సూక్శ్మ శరీరానికి), బుద్దికి (కారణ శరీరానికి) కారణము ద్వైతము అని తెలుస్తోంది.
ధ్యానములో మనని,మన ఆలొచనలని , మనము గమనిస్తూ -ve (భ్రమణం ఉన్నవీ) తీసేస్తే మిగిలేది +ve. ఈ స్థితి ఆత్మస్తితి, ఆనందస్తితి. -ve మరియు +ve రెండు లేని స్థితి పర్తమాత్మ స్థితి. పరమాత్మది – నిర్గుణ నిరాకార స్థితి.
ఇక్కడ తెలుసుకోవలిసింది, మన ఈ భౌతిక షరీరానికి, స్థితికి కారనము -ve మరియు +ve అంటే అజ్ఞానము వలన -veఅలోచనలు వీతివలన శరీరము. శరిరము మరియు ప్రపంచము మన ఆలొచనల రూపము. మన ఆలొచనలే గట్టిపడి(condense) శరీరముగ కనపడుతొంది. అలాగే పరమాత్మ(as per science it is unknownభ్రమణం లేని) ఆలోచనలే గట్టిపడి(condense) ప్రపంచముగా కనపడుతొంది.
ధ్యానంలో మనం శరీరమునుందీ విస్తరించి విశ్వవ్యాప్తమై పరమత్మస్తితి పొందుతాము.
* వాక్యూం కి ఉదహరణాలు – ఆకాశము(space), వేడి(heat) ప్రేమ (love), ఆనందము (happiness)
etc ..
పదార్థం కి ఉదహరణాలు – నక్శత్రాలు, గ్రహాలు, etc ..
Click here for English Weblog – edivinity.wordpress.com
ఆనందము, ఏడవస్తితి, ఓం, కారణశ, బుద్ది, భౌతికశక్తి, మనసు, ముక్తి, సూక్ష్మశక్థి(
In జ్ఞానము on అక్టోబర్ 9, 2008 at 2:29 అపరాహ్నం
దసరా పందుగ శుభాకాంక్షలు.
పరమాత్మను మనము రెండు రూపాల్లో ,ఏదు స్థితులలో చూడవచ్చు, తెలిసికొనవచ్చు.
సకారము, నిరాకారము.
సకారము మాత్రమె ఉంతె అది ఒక పదార్థము కాలేదు. దీనికి నిరకార శక్తి కలిస్తే పదార్థము లేక జేవము. పరమానువును తేసుకొండి. ఎలెచ్క్ట్రాను ప్రోటానుల సమూహము. ఎలెక్ట్రాన్(-ve-సకారము) మరియు ప్రోటాను(+ve-నిరాకారము) పదార్థ రూపానికి కారణము.
ఉదాహరంకు :
1. ఎలెక్త్రిచ్ బల్బు తేసుకొండి. ఎలెక్ట్రిసిటి లేకపొతే బల్బుకు విలువలెదు. అలాగె బల్బు వలననే మనము ఎలెక్ట్రిసిటిని గుర్తించగలుగుతాము. ఇక్కడ బుల్బ్ – సకారము, ఎలెక్ట్రిసిటి – నిరాకరము.
కనిపించే ప్రక్రుతిని పరమాత్మ భౌతికశరీరముగా గా భావించండి(సకారము). ఇందులో (గాలిలో,నీటిలో,ఆహారములో) ఉన్న శక్తిని(చైతన్యము లేక ప్రానశక్తి) భౌతిక చైతన్యముగ గుర్తించండి(నిరాకారము). ఇది పరమాత్మ భతిక రూపము. మనకు భౌతికలోకము.
ప్రక్రుతిలో మార్పుకు కారణమైన ఆలొచనలు(మనసు లేక డబ్బు) పరమాత్మ సూక్ష్మశరీరము గా భావించండి(సకారము). ఇందులో ఉన్న శక్తిని(ప్రేమ) సూక్ష్మ చైతన్యముగ గుర్తించండి(నిరాకారము). ఇది పరమాత్మ సూక్ష్మ రూపము. మనకు సూక్ష్మలోకము.
ప్రక్రుతిలో ఆలొచనలు కారనమైన జ్ఞానము(బుద్ది లేక సైన్సు) పరమాత్మ కారణశరీరము గా భావించండి(సకారము). ఇందులో ఉన్న శక్తిని(ఆనందము) కారణ చైతన్యముగ గుర్తించండి(నిరాకారము). ఇది పరమాత్మ కారణ రూపము. మనకు కారణలోకము .
వీటికి ఆవల ఉన్న సత్ చిత్ ఆనంద రూపమే పరమాత్మ అసలైన నిజ రూపము.ఇది శబ్ద రూపము. పై ఆరింటికి కారణమైన ఓం లేక ఆమెన్ లేక ఆల్లా.
మూలపదార్థమైన ఓం నుంచే మూడు చైతన్యాలు మూడు పదార్థాలు ఉద్భవించాయి. ఇవే పరమాత్మ ఏడు స్తితులు – ఏడుకొండలు.
ధ్యానములో , మననిమనము గమనిస్తే , మనకు మూడు శరీరాలు, మూడు చైతన్యాలు ఉన్నట్టుగ తెలుస్తుంది. వీటికి అధారము ఒక పరమాత్మ(శబ్డము) అని తెలుస్తుంది.
మనభౌతికశరీరంలో(శరీరము) భౌతికశక్తి(యొగములొని కుండలిని), సూక్ష్మశరీరములోని(మనసు) సూక్ష్మశక్థి(ప్రేమ) ,కారణశరీరములోని(బుద్ది) కారణశక్థి(ఆనందము), వేతికి కారణమైన శబ్దము(ఓం).
మనభౌతికశరీరము(శరీరము) నేను కాదు , సూక్ష్మశరీరము(మనసు) నేను కాదు, కారణశరీరము(బుద్ది), వేటికి ఆధారమైన భౌతికశక్తి(కుండలిని) నేను,సూక్ష్మశక్తి(ప్రేమ) నేను, కారనశక్తి(ఆనందము) నేను, శబ్దము(ఓం లేక సత్ చిత్ ఆనందము) నేను.
ఇవే మన ఏడు స్తితులు – ఏడుకొండలు. ధ్యానములో ఏడవస్తితిని తెలుసుకోవడమె ముక్తి.
Click here for English Weblog – edivinity.wordpress.com
ప్రార్థన, meditation, prayer
In జ్ఞానము on అక్టోబర్ 9, 2008 at 12:26 పూర్వాహ్నం
తల్లీ ప్రక్రుతిమాతా పదాభివందనము, నా తప్పులను క్షమించు, మాకు అరోగ్యాన్ని ఆనందాన్ని ఇవ్వు.
తండ్రీ పరమపితా పదాభివందనము, నా తప్పులను క్షమించు, మాకు అరోగ్యాన్ని ఆనందాన్ని ఇవ్వు.
తల్లీ ప్రక్రుతిమాతా , క్రుతజ్ఞతలు.
తండ్రీ పరమపితా, క్రుతజ్ఞతలు.
నా శరీరం ఆరొగ్యంగా ఉండనీ.
నా మనసు అందరినీ ప్రెమించనీ.
నా బుద్ది అజ్ఞానం తొలగనీ.
నేను చైతన్యాన్ని, నేను శక్తిని.
నేను హ్రుదయాన్ని, నాకు ఎవరిమీద ద్వేషము లేదు , నేను అందరినీ ప్రేమిస్తున్నాను.
నేను ఆత్మను, ఎల్లపుదూ ఆనందముగా ఉంటాను.
(రోజుకు మూదుసార్లు , పదిహేను నిమిషములు , స్తిరంగా నిటరుగా కూర్చొని , కళ్ళు మూసుకొని , వర్థమానములొ ఉంటూ మీచుట్టూ ఉన్న శబ్దాలను,మీ అలొచనలను గమనించండి.)
తల్లీ ప్రక్రుతిమాతా , క్రుతజ్ఞతలు.
తండ్రీ ప్రమపితా, క్రుతజ్ఞతలు.
Click here for English Weblog – edivinity.wordpress.com
ఆధ్యాత్మికత, నేను, శరీరము, శాకహారము, body, I am, spirituality, Vegetarian
In జ్ఞానము on అక్టోబర్ 7, 2008 at 7:27 అపరాహ్నం
నేను – శరీరాన్ని(భౌతిక శరీరాన్ని), మనసుని(సూక్శ్మ శరీరాన్ని), బుద్దిని(కారణ శరీరాన్ని) .
నేను – చైతన్యాన్ని(శక్తిని), హ్రుదయాన్ని(ప్రేమని), ఆత్మని(సత్చితానందాన్ని).
శరీరానికి మంచి ఆహారము అవసరము.మంచి ఆహరము చైతన్యం కలిగిస్తుంది.
మనసుకు మంచి ఆలొచనలు అవసరము.మంచి ఆలొచనలు ప్రేమను పెంపొందిస్తాయి.
బుద్దికి మంచి జ్ఞానము అవసరము.మంచి జ్ఞానము ఆనందనికి దారితీస్తుంది.
మంచి ఆహరము – ప్రక్రుతి వొడిలోంచి వచ్చినదయి ఉందాలి. శాకహారము మాత్రమె మనకు అవసరము. అప్పుడే తల్లితో మనం మమేకం కాగలము. తల్లి వొదిళొ ఉన్న పిల్లవాని వలె మనకు సమ్రక్షన(security) తల్లి ఇస్తుంది. గ్రుడ్లు, మంసం, మద్యం ..ఇలంటివి మనని తల్లికి దూరంగా ఉంచుతాయి. మాంసాహారము తీసుకుంటె , మనం తల్లికి దూరంగా ఉన్న చిన్న పిల్లవానితో సమానము.
శరీరము ..అయిదు మూలకాలతొ నిర్మించబడి వీటిని ఆహారము, శ్వాస , నీరు ద్వార లోపలికి ఈసుకొంటు చైతన్యాన్ని పొందుతుంది.
మంచి ఆలోచనలు – మనసుని బలం చెస్తాయి. మంచి ఆలొచనలున్న వాల్ల మధ్య గడపడము వలన , మీ చుట్టూ చెడు దూరమై శరీరము కూడ అరోగ్యమై ఆనందానికి దారితీస్తుంది.
శరీరానికి ఆహారము ఎంత అవసరమొ మనసుకు మంచి అలోచనలు అంతే అవసరము. ప్రతి రోజు మూడు సార్లు కనీసం పదిహేను నిమిషాలసేపు మనసుని దెవునిగురించి ఆలోచినంచనీయండి. మనసుని ప్రక్రుతిని ఆస్వదిస్తూ వర్థమానములో ఉంచండి, భవిశ్యత్తు మరియు గతం లోకి వెల్లనీయవద్దు. ఇదె ధ్యానము .
మంచి జ్ఞానము – బుద్ది ని వ్రుద్ది పరచి ఆనందానికి దరితీస్తుంది. దేవునిగురించిన జ్ఞానము , ప్రక్రుతిని గురించిన జ్ఞానము మిమ్మల్ని ఆనందమువైపు నడిపిస్తుంది.
ఇప్పుదు మీరు చదువుతున్నది ప్రక్రుతి, దేవుడు, మీగురించి న జ్ఞానము .ఇది మీలో ఆధ్యాత్మికత పెంచి ఆనదంవైపు నదిపిస్తుంది.
ఆనందం అన్ని జేవుల చరమ లక్శ్యము.
Click here for English Weblog – edivinity.wordpress.com
divine life, Father and Mother
In జ్ఞానము on అక్టోబర్ 7, 2008 at 4:10 అపరాహ్నం
ప్రక్రుతి అయిన తల్లితో మమేకం కండి, తండ్రి అయిన దేవుని ప్రేమించండి. ఒక ఇంటిలో తల్లిదండ్రులను గమనించండి. తండ్రి బయటకు వెల్లి డబ్బులు తెస్తాడు, తల్లి పిల్లల పెంపకము చూస్తుంది. పిల్లలు తప్పు చేస్తే తల్లి ఎక్కువగా దండిస్తుంది. ఇదే ధర్మాన్ని మనం ప్రక్రుతికి, దేవునికి అన్వయించుకొవాలి.
సమస్యలు , భాధలు తల్లి వెసే శిక్ష లాంటిదే. తల్లి దండించింది అంటె నువ్వు తప్పు చేసావని,ధర్మము తప్పావని అర్థం.మనకున్న అయిదు ఇంద్రియాలను ప్రక్రుతికి అనుగుణంగా ఉందేటట్లు చూసుకొవాలి. కళ్ళు మంచినే దర్శించనీ, చెవులు మంచినే వినని, శ్వాస తల్లి శ్వాసతో(earth resonance) ఎకకాలికగ ఉండని, నోరు మంచి అహరమే తీసుకొనని, శరీరము పరిశుభ్రముగ ఉండని. పంచేంద్రియాలు వర్తమానములొ ఉంటూ , ప్రక్రుతితో మమేకమై ఉండని.
మనిషి పుట్టింది, తల్లితో (ప్రక్రుతి) మమేకమై , తండ్రిని (దేవుని) తెలుసుకొని దివ్యజేవనము గడపమని. దివ్యజేవనము అలవాటు కావాలంటె, ప్రక్రుతిపై, దేవునిపై భక్తి ప్రేమ కలగాలి. భక్తి కి వైరాగ్యం కావాలి. వైరాగ్యం సత్కర్మలు,శాకాహారము వల్లనె సాధ్యం.
god, knowledge, nature
In Uncategorized on అక్టోబర్ 7, 2008 at 6:51 పూర్వాహ్నం
జ్ఞానము - అనగా మన గురించి, కనిపించే ప్రపంచం గురించి, కనిపించని ప్రపంచం గురించిన సత్యము. ఎంతో విలువైనది. మనకు ఈ సత్యము తెలియకపొతె ఎన్నితెలిసినా సున్న(zero) తొ సమానము. జ్ఞానము – విజ్ఞానము, అధ్యాత్మికము అనె రెండు విభాగలుగా ఉంది. ఈ రెండు తప్పనిసరిగా మనిషికి అవసరము.
ఈ వెబ్లాగు మీ లో ఆధ్యాత్మికతను పెంచి మిమ్మల్ని పరిపూర్ణ మనవులుగా తిర్చిదిద్దుతుంది.