ejnanamu

నేను

In జ్ఞానము on అక్టోబర్ 7, 2008 at 7:27 అపరాహ్నం

నేను – శరీరాన్ని(భౌతిక శరీరాన్ని), మనసుని(సూక్శ్మ శరీరాన్ని), బుద్దిని(కారణ శరీరాన్ని) .
నేను – చైతన్యాన్ని(శక్తిని), హ్రుదయాన్ని(ప్రేమని), ఆత్మని(సత్చితానందాన్ని).

శరీరానికి మంచి ఆహారము అవసరము.మంచి ఆహరము చైతన్యం కలిగిస్తుంది.
మనసుకు మంచి ఆలొచనలు అవసరము.మంచి ఆలొచనలు ప్రేమను పెంపొందిస్తాయి.
బుద్దికి మంచి జ్ఞానము అవసరము.మంచి జ్ఞానము ఆనందనికి దారితీస్తుంది.

మంచి ఆహరము – ప్రక్రుతి వొడిలోంచి వచ్చినదయి ఉందాలి. శాకహారము మాత్రమె మనకు అవసరము. అప్పుడే తల్లితో మనం మమేకం కాగలము. తల్లి వొదిళొ ఉన్న పిల్లవాని వలె మనకు సమ్రక్షన(security) తల్లి ఇస్తుంది. గ్రుడ్లు, మంసం, మద్యం ..ఇలంటివి మనని తల్లికి దూరంగా ఉంచుతాయి. మాంసాహారము తీసుకుంటె , మనం తల్లికి దూరంగా ఉన్న చిన్న పిల్లవానితో సమానము.

శరీరము ..అయిదు మూలకాలతొ నిర్మించబడి వీటిని ఆహారము, శ్వాస , నీరు ద్వార లోపలికి ఈసుకొంటు చైతన్యాన్ని పొందుతుంది.

మంచి ఆలోచనలు – మనసుని బలం చెస్తాయి. మంచి ఆలొచనలున్న వాల్ల మధ్య గడపడము వలన , మీ చుట్టూ చెడు దూరమై శరీరము కూడ అరోగ్యమై ఆనందానికి దారితీస్తుంది.

శరీరానికి ఆహారము ఎంత అవసరమొ మనసుకు మంచి అలోచనలు అంతే అవసరము. ప్రతి రోజు మూడు సార్లు కనీసం పదిహేను నిమిషాలసేపు మనసుని దెవునిగురించి ఆలోచినంచనీయండి. మనసుని ప్రక్రుతిని ఆస్వదిస్తూ వర్థమానములో ఉంచండి, భవిశ్యత్తు మరియు గతం లోకి వెల్లనీయవద్దు. ఇదె ధ్యానము .

మంచి జ్ఞానము – బుద్ది ని వ్రుద్ది పరచి ఆనందానికి దరితీస్తుంది. దేవునిగురించిన జ్ఞానము , ప్రక్రుతిని గురించిన జ్ఞానము మిమ్మల్ని ఆనందమువైపు నడిపిస్తుంది.

ఇప్పుదు మీరు చదువుతున్నది ప్రక్రుతి, దేవుడు, మీగురించి న జ్ఞానము .ఇది మీలో ఆధ్యాత్మికత పెంచి ఆనదంవైపు నదిపిస్తుంది.
ఆనందం అన్ని జేవుల చరమ లక్శ్యము.
Click here for English Weblog – edivinity.wordpress.com