ejnanamu

శుభ్రము

In జ్ఞానము on అక్టోబర్ 11, 2008 at 4:54 అపరాహ్నం

గత పేజీలలో మనకు మనకున్న మూడు శరీరాలగురించి వివరించాను.

మనము మన భౌతిక శరీరమును ఎలాగ రోజు స్నానము తో శుభ్రము చేసుకొంటామో , మిగత రెండు శరీరాలను (1.సూక్ష్మశరీరాము లేక మనసు 2.కారణశరీరాము లేక బుద్ది) కూడ రోజు తప్పనిసరిగా శుభ్రముచేసుకోవాలి వీలైతే మూడు సార్లు లేక కనీసము ఒక సారైనా బ్రహ్మముహూర్థములో(4.30AM to 5.30AM).

మనసును , బుద్దిని శుభ్రము చేయడము ప్రపంచాధిపతి కావడంకన్నా కష్టమైనపని. మన మనసు,బుద్ది శుభ్రము మనవల్లనే సాధ్యము. గమనించండి – ధుర్యోధనుని మార్చడానికి క్రిష్ణుని వల్లనే కాలేదు. రావణుని మార్చడానికి రాముని వల్లనే కాలేదు. అందుకే మన మనసుని మనమే శుభ్రము చేసుకోవాలి.

మనసు అంటే ఆలొచనలు. ఆలొచనలు రెందు రకాలు మంచి(+ve) మరియు చెడు(-ve).

మంచి ఆలొచన అంటె హ్రుదయము. ఇక్కడ ప్రేమ మాత్రమే ఉంటుంది.

చెడు ఆలొచనలు – కామ , క్రోధ, లోభ , మోహ , మద , మత్సరాలు మరియు తోడుగ వంద వరకు ఉన్నాయి. చెడులు అన్నీ తెలుసుకొని తొలగించుకోవదము కష్టమైన పని. రెండు పద్దతులు వివరిస్తాను.

1.ధ్యానములో మీలో వస్తున్న , గత సంఘటనలకు సంభంధించిన, భాధలు,సమస్యలు , ఆలోచనలను తప్పించుకోవడానికి ప్రయత్నించకండి. వాటిని స్వాగతించి వాటిలో మమెకమై వాటిలోని నిజాలను , తప్పులను గమనించి అనుభవములోనికి తెచ్చుకోండి. అవి వాటంతట అవేతొలిగిపోయేవరకు వాటి అనుభవములో గడపండి. భాధాకరన సంఘటనలు మిమ్మలిని ఏడ్పిస్తాయి. తరువాత అవి క్రమంగా తొలిగి ప్రాశాంతత ఏర్పడు తుంది.తిరిగి ఆ ఆలోచన మీ మదిలో ఇంక ఎప్పడికి రాదు.

2. మనం ధ్యానములో మంచి – సర్వ ప్రానులపట్ల ప్రేమ , దేవునిపట్ల ప్రేమ ఉందా , ఎంత ఉంది అని గమనించాలి. ఇది పెంచుకోవదానికి ప్రయత్నించాలి. మన శరీరా శుభ్రతకు సబ్బు,నీల్లు ఎలాగొ , మనసుని శుభ్రము చేయడానికి ప్రేమ అవసరము. మంచి మీలొ పెరిగినాకొద్దీ చెడు దూరమైపోతుందీ.మీ మనసు దివ్యత్వము సంతరించుకొంటుంది.

మీ మనసులో మంచి ఏర్పడి చెడు తొలగిపోవదము వలన మీ సమస్యలు వటంతట అవే తొలగి పోవటము మీరు చూస్తారు. ఎందుకంతే మీలో ఉన్న ఆ ఆలోచనలే (subconcieous mind) మీ చుట్టూ ఏర్పడే పరిస్తితులకు కారణము. గమనించండి – ఆలోచనలే గట్టిపడి భౌతిక పదార్థముగ కనపడుతోంది.

ఇంకావుంది(Continued)….

Click here for English Weblog – edivinity.wordpress.com