ejnanamu

శుభ్రము 2

In జ్ఞానము on అక్టోబర్ 13, 2008 at 6:31 అపరాహ్నం

‘శుభ్రము’ కి పొడగింపు(Continued from lastpost) ….
 
బుద్ది అంటే జ్ఞానము , అజ్ఞానము రెండు విధాలు.
అజ్ఞానము – అంటే గర్వము, పొగరు etc…  అజ్ఞానము వలన బుద్ది మూర్ఖంగా ప్రవర్తిస్తుంది. దేవుని కి సంభంధించిన, ప్రక్రుతికి సంభంధించిన విషయాలపట్ల అవగాహన పెంచుకోవడానికి ఇష్టపడదు. బుద్దిని  శుభ్రము  చేయడానికి జ్ఞానము అవసరము.జ్ఞానము – అనగా మన గురించి, కనిపించే ప్రపంచం గురించి,  కనిపించని ప్రపంచం గురించిన సత్యము. ఎంతో విలువైనది. దీనినే దేవుడు అని మనం పిలుస్తాము. ఈ జ్ఞానము మీకు లభిస్తే మీ బుద్ది శుద్ది అయి అజ్ఞానము తొలగి ఆనందము మీ సొంత మౌతుంది.

బుద్ది ని శుద్ది చేసుకొవడానికి లేక జ్ఞానము సంపదించదానికి సాధన అవసరము. ఈ సాధన మనకు తెలియకుండానే తండ్రి అయిన భగవంతుడు , మన తల్లి అయిన ప్రక్రుతి ద్వారా మనతో చేయిస్తూనే ఉంటాడు. మనని జ్ఞానము వైపు నడిపిస్తూనే ఉంటాడు.
గమనించండి – మనకు వచ్చే కష్టాలు, దుఃఖాలు మనకు తండ్రి వేస్తున్న పరిక్షలు. మనలో వైరాగ్యము పెంచి జ్ఞానముపై ఆసక్తి కలిగేల చేయడము. అదె ఆ తండ్రి  కి ముఖ్యమైన పని. ఒక పసిపాపపై తల్లి తండ్రి  ప్రేమిస్తూ పెంచి , మంచి విధ్యాబుద్దులు నేర్పి తమకంటే గొప్పవాల్లను చేయాలని చూస్తారు. ఇదే తల్లి అయిన ప్రక్రుతి , తండ్రి అయిన భగవంతుడి తత్వము.

ఇంకావుంది(Continued )…

Click here for English Weblog – edivinity.wordpress.com