ejnanamu

శుభ్రము 3

In జ్ఞానము on అక్టోబర్ 14, 2008 at 8:16 అపరాహ్నం

 ‘శుభ్రము 2’ కి పొడగింపు(Continued from lastpost) ….

 బుద్ది శుద్ది చేయడము కర్మ, జ్ఞాన , మరియు భక్తి మార్గముల ద్వారా సాధ్యము.  వీటిని మూడింటిని ఒకదానితో ఒకటి కలిపి చూస్తేనే సాధన పరిపూర్ణము అవుతుంది. టూకీగా చెప్పాలంటే – సత్కర్మలు చేయడమువలన , జ్ఞానము నందు ఆసక్తి కలుగుతుంది,   జ్ఞానము వలన బుద్ది శుద్ది అయి భక్తి కలిగి   మోక్షమునకు  (సత్ చిత్ ఆనందస్తితి లేక పరమాత్మ స్తితికి ) దారితీస్తుంది.

కర్మ – మార్గము  అంటే సత్కర్మలు చేయడము.  సత్కర్మలు అంటే మంచి కర్మలు. దేవునిపై విశ్వాసము , మనుషులపై , జంతువులపై, పక్షులపై,  సర్వ ప్రక్రుతిపై ప్రేమ మాత్రమే (ద్వేషము లేని) కలిగిఉండడము. గమనించండి – తండ్రి అయిన దేవుడు(నిరకారము)  మరియు తల్లి అయిన ప్రక్రుతి ( సకారము ) మనకు , జీవులన్నింటికి కావలసినవని ఇస్తూ కూడ మననించి ప్రేమ మాత్రమే ఆశిస్తారు. ఇలాంటి ప్రేమనే మనము దేవునిపై , ప్రక్రుతిపై , సర్వ ప్రాణులపై  ప్రకటించాలి. ఇదే కర్మ మార్గము. భగవంతుని ప్రార్థించడము , పూజలు చేయడము , తీర్థయాత్రలు చేయడము వీటిలో భాగమే. ఇలాంటి సత్కర్మలు మనము తప్పక చేయాలి . వీటివల్ల జ్ఞానము పై ఆసక్తి  కలుగుతుంది. ఆధ్యాత్మిక మార్గములో సత్కర్మలు మనము వేసే మొదటి అడుగులు.

ఇంకావుంది(Continued )…

Click here for English Weblog – edivinity.wordpress.com