గత పుటల్లో నేను చెప్పాను, మంచి పనులు(సత్కర్మలు చేయడము, శకాహారము) వలన తల్లి అయిన ప్రక్రుతిని గురించి తెలుసుకోవలని ఆసక్తి పెరుగుతుంది. మీ అధ్యాత్మిక ప్రయాణము జ్ఞానమార్గములో ప్రవేశిస్తుంది.
ఇప్పుడున్న కాల పరిస్తితులలో నూటికి టొంభైతొమ్మిది మనుషులు కర్మ మార్గము మాత్రమె పరిచయ మైనవారు. మిగతా ఒక శాతము జ్ఞానము , భక్తి పరిచయమైనవారు.
మీకు ఇప్పుడు నేను చెప్పేవిషయాలు చదవాలనే ఆసక్తి కలిగితే , ఇంకాతెలుసుకోవాలని మీ కనిపిస్తే మీరు సత్కర్మలు లేక , శాకహారము ఏదో ఒక జన్మలో ప్రారంభించినవారే. జ్ఞానము సాధన తీవ్రమైతే దేవుడు మాత్రమే సత్యము మరియు శశ్వతము అని , మిగతా అన్నీ ఆసత్యాలు మరియు అశశ్వతము అని గ్రహిస్తారు. దీనినే భక్తి అనవచ్చు. భక్తి అనేది ప్రేమకు పరాకాష్ట . తల్లి అయిన ప్రక్రుతి పట్ల గాని, తండ్రి అయిన దేవుని పట్ల గాని ప్రేమ లేకుండా మనము సత్కార్యాలు , శాకహారము మొదలుపెట్టలేము. సత్కార్యాలు , శాకహారము మొదలుపెట్టితే గాని జ్ఞానము పై ఆసక్తి కలిగి భక్తికి దారితీయదు. ఇప్పుడు చెప్పండి భక్తి ముందా , కర్మ ముందా? ఇది కోడి ముందా , గ్రుడ్డు ముందా అన్నట్లు ఉంటుంది.
సత్యమేమంటే , ఇవి రెండు కాదు ఆనందము మత్రమే ముందు. ఆనందమే ఆత్మ. విశ్వమే తనై తను మాత్రము ఆనందస్తితిలో ఉంటే ఆత్మ.
ముందు ఆకరములేని(నిరాకారము) , గుణములేని(నిర్గునము) అయిన పరమాత్మ మత్రమే ఉన్నాడు. ఇది పరమాత్మ. ఈ స్తితిలో ఎలాంటి గుణము లేన్నందున మన ఋషులు ఆత్మనే పరమాత్మ గా వర్ణించారు. ఇదీ స్రుష్టి క్రమము.