ejnanamu

ఫ్యామిలీ

In జ్ఞానము on అక్టోబర్ 20, 2008 at 6:04 అపరాహ్నం

ఆలోచనలు రెండు విధాలు, అవి మంచి ఆలోచనలు మరియు చెడు ఆలోచనలు అని చెప్పాను. మంచి ఆలోచనలలో ప్రేమ గుణము మాత్రమే ఉంతుంది, పాండవుల్లాగ. చెడు ఆలోచనలలో ప్రేమ గుణము ఉండదు మరియు దుర్గుణాలు లెఖ్ఖలేనన్ని, కౌరవుల్లాగ.

చెడు ఆలోచనలనే మనసు అని , మంచి ఆలోచనలను హ్రుదయము అని పిలుస్తాము. ఈ మనసుని ( చెడు ఆలోచనలను ) రోజూ హ్రుదయము ( ప్రేమ ) తో శుబ్రము చేసుకొని మనసుపై విజయముసాధించాలి. ఇంతకుముందు పుటల్లో నేను చెప్పాను, మన శరీరము రోజూ శుబ్రము చేయడము ఎంత అవసరమో , మనసుని ( చెడు ఆలోచనలను ) తొలగించివేయడము కూడా అంతే అవసరము. గమనించండి , దుర్యోధనుడిని ( మనసుని) మార్చడము క్రిష్నుడి వల్లనే కాలేదు, వాడు ( మనసు ) చావవలసిందే. చెడు ఆలోచనలను తొలగించివేయడము అంటే మనసు చనిపోవడమే, మనసు లేకపోతే హ్రుదయము (ప్రేమ) మాత్రమే మిగులుతుంది. ఇదే భగవంతుడు.

దేవుడు అంటే శక్తి, ప్రేమ మరియు ఆనందము. మనలో ఇవి ఎంత ఎక్కువగా ఉంటే మనము భగవంతునికి అంత దగ్గరగా ఉన్నట్టు. మనము చేయవలసిందల్లా మన మనసుని రొజూ శుభ్రము చేసుకోవడమే. భగవంతుడు తనకు తానుగా మన హ్రుదయములో ప్రత్యక్షమవుతాడు.

మనసు ప్రభావము ఫ్యామిలీలోని వారిపట్ల ఎంత తీవ్ర ప్రభావము చూపి, ఎన్నో దురద్రుష్ట సంఘటనలకు కారణమవుతుందో తరువాత ఇక్కడ , ఒక సంఘటన నేను మీకు వివరిస్తాను.

ఇంకావుంది…

Click here for English Weblog – edivinity.wordpress.com