మనిషి తత్వము మరియు దేవుడి తత్వము రెండూ అర్థము చేసుకోవాలి. అప్పుడె మనిషి , దేవుడు రెండింటికి అర్థము భోధపడుతుంది.
మనము మనసుతో పనిచేస్తాము కాబట్టి మనుషులము. మనసులేకపోతే దేవుడు. శరీరములో మనసు ఉంటే మనిషి , శరీరములో మనసు లేకపోతే దేవుడు.
మనసు అంటే అలోచనలు, ముఖ్యంగా చెడు ఆలోచనలు. చెడు అలోచనలను ఆపెయ్యగలిగితే మనము దివ్యత్వము పొందుతాము. దేవుడవుతాము. మంచి ఆలోచనలు ఉన్నా నష్టము లేదు కనుక మంచి ఆలోచనలు ఉన్నవాల్లను కూడ మనము దేవుడు అంటాము. అంటే దేవుడంటే మనిషినుండి మార్పుచెంది దేవుడిగా మారిన(ది)వాడు.
దేవుల్లు అంటే -
1. చెడు ఆలోచనలు లేనివాళ్ళు మరియు మంచి ఆలోచనలు ఉన్నవాళ్ళు. దీనినే ఆత్మ అంటాము. మనిషి ఈ స్థితిలో ఉంటే ఆత్మ స్థితి. ఇదే ఆత్మ తత్వము.
2. ఎలాంటి ఆలోచనలు లేని వాళ్ళు . దీనినే పరమాత్మ అంటాము. మనిషి ఈ స్థితిలో ఉంటే పరమాత్మ స్తితి. దీనినే యోగశాస్త్రములో సమాధి స్థితి అన్నారు. ఇదే పరమాత్మ తత్వము.
మనిషి దేవుడుగా మారటము , తిరిగి దేవుడు ప్రపంచము స్రుష్టించి (తనే ప్రపంచముగా మారి ) మనిషులుగా రూపము పొంది దేవుళ్ళు గా మారటము. ఈ దేవుళ్ళు తిరిగి ఒక్కొక్క ప్రపంచము స్రుష్టించి (ఒక్కొక్క ప్రపంచముగా మారి ) మనిషులుగా రూపము పొంది దేవుళ్ళు గా మారటము. లెక్కలేనన్ని ప్రపంచాలు , ఒక్కో ప్రపంచనికి ఒక్కొ దేవుడు. ఒక్కో దేవుడికి ఒక్కో ప్రపంచము.