ejnanamu

దీపావళి

In జ్ఞానము on అక్టోబర్ 28, 2008 at 10:41 అపరాహ్నం

దీపావళి శుభాకాంక్షలు.

మన పురాణాలలో త్రిమూర్థులు బ్రహ్మ , విష్ణు , మహేశ్వరుడు వారి భార్యలు సరస్వతీదేవి, లక్ష్మిదేవి , పార్వతిదేవి.

మనకున్న మూడు శరీరాలు- భౌతిక, సూక్ష్మ, కారణ శరీరాల లాగనే, తండ్రి అయిన భగవంతుడిని మూడు ప్రపంచాలు- భౌతిక, సూక్ష్మ, కారణ ప్రపంచాలని ఆయనకున్న   మూడు శరీరాలుగా గుర్తించాలి.వీటినే భగవంతుడి సకారరూపాలుగా మనము గుర్తించాలి. వీటినే శరీరము , మనసు, బుద్ది అని గత పుటల్లో తెలుసుకొన్నాము. ఈ సకారరూపాలనే పార్వతిదేవి, లక్ష్మిదేవి, సరస్వతీదేవి గా మన ఋషులు వర్ణించారు. కనిపించే భౌతిక ప్రపంచము(UNIVERSE) పార్త్వతీదేవి రూపము, ప్రపంచాన్ని నడిపిస్తున్న డబ్బు (MONEY)  లక్ష్మీదేవి రూపము , విజ్ఞానము(SCIENCE) సరస్వతీదేవి రూపము.   
 
మనకున్న మూడు శరీరాలకు శక్తి నిస్తున్న- కుండలిని, హ్రుదయము, ఆత్మ లాగానే , తండ్రి అయిన భగవంతుడిని మూడు  ప్రపంచాలకి శక్తి నిస్తున్న- భౌతిక శక్తి , ప్రేమ , ఆనందము  లను మహేశ్వరుడు, విష్ణు , బ్రహ్మ లుగా మన ఋషులు వర్ణించారు.

ఈ దీపావళి రోజు మనము లక్ష్మీ దేవిని  పూజిస్తాము. అంటే తండ్రి అయిన పరమాత్మ  సూక్ష్మరూపాన్ని  ధ్యానిస్తూ  మన   సూక్ష్మరూపమయిన మనసు లేక చెడు ఆలోచనలను  తొలగించుకోవడనికి మనము ప్రయత్నము చేయాలని గుర్తుచేసుకొంటాము. భగవంతుని సూక్ష్మరూపమయిన  లక్ష్మీ దేవిని ఆశీర్వదించమని కోరుకొంటాము.

Click here for English Weblog – edivinity.wordpress.com