ejnanamu

అద్భుతాలు

In జ్ఞానము on నవంబరు 3, 2008 at 2:59 అపరాహ్నం

భగవంతుడు పరిచయమైతే మనకు అన్నీ అద్భూతాలుగానే కనిపిస్తాయి.

మన శరీరము ఒకా ఆద్భుతము. ఆందులో జీవము ఒక ఆద్భుతము.విశ్వము ఒక అద్భుతము. ప్రాణశక్తి అద్భుతము. ఇలా అద్భుతము కానిదేదీ లేదు.

మనముగా చేసే పనులు కాకుండ , మనవల్లకాని పనులను ఎవరైనా చేస్తే అవి అద్భుతాలుగా మనము చూస్తాము. కాని స్రుష్టి లో , మనలో  తొంగి చూస్తే ఉన్న అద్భుతాలను మనము గమనించము. ప్రక్రుతిని, దేవున్ని ప్రేమిస్తే అద్భుతాలు కానివేవి మనకు కనిపించవు. మనము మాట్లాడడము అద్భుతము కాదా? శ్వాస ఆద్భుతము కాదా? గుండె కొట్టు కోవడము అద్భుతము కాదా? భూమి అద్భుతము కాదా? సూర్యుడు అద్భుతము కాదా? ప్రాణశక్తి అద్భుతము కాదా?

ఇన్ని అద్భుతాలు చేస్తున్న దేవున్ని మాత్రము గుర్తించము.

ఇలా గుర్తించక పోవడానికి  – మనసు , బుద్ది కారణము. ఇంతకు ముందు జాబుల్లో చెప్పాను, మనసు అంటే చెడు ఆలోచనలు , బుద్ది అంటే ఆజ్ఞానము. మనశరీరాన్ని శుభ్రము చేస్తున్నట్టె మనసుని శుభ్రము చేయాలి, బుద్దిని శుభ్రము చేయాలి.(ఇటీవలి జాబులు చూడండి)

మనసు శుభ్రము చేస్తే హ్రుదయము మిగులుతుంది. బుద్దిని శ్భురము చేస్తే ఆనందము మిగులుతుంది. అప్పుడె ప్రక్రుతి, దేవుని అద్భుతాలు మనము చూడగల్గుతాము.

Click here for English Weblog – edivinity.wordpress.com