ejnanamu

దివ్యజీవనము

In జ్ఞానము on అక్టోబర్ 7, 2008 at 4:10 సా.

ప్రక్రుతి అయిన తల్లితో మమేకం కండి, తండ్రి అయిన దేవుని ప్రేమించండి. ఒక ఇంటిలో తల్లిదండ్రులను గమనించండి. తండ్రి బయటకు వెల్లి డబ్బులు తెస్తాడు, తల్లి పిల్లల పెంపకము చూస్తుంది.  పిల్లలు తప్పు చేస్తే తల్లి ఎక్కువగా దండిస్తుంది. ఇదే ధర్మాన్ని మనం ప్రక్రుతికి, దేవునికి అన్వయించుకొవాలి.

సమస్యలు , భాధలు తల్లి వెసే శిక్ష లాంటిదే. తల్లి దండించింది అంటె నువ్వు తప్పు చేసావని,ధర్మము తప్పావని అర్థం.మనకున్న అయిదు ఇంద్రియాలను ప్రక్రుతికి అనుగుణంగా ఉందేటట్లు చూసుకొవాలి. కళ్ళు మంచినే దర్శించనీ, చెవులు మంచినే వినని, శ్వాస తల్లి శ్వాసతో(earth resonance) ఎకకాలికగ ఉండని, నోరు మంచి అహరమే తీసుకొనని, శరీరము పరిశుభ్రముగ ఉండని. పంచేంద్రియాలు వర్తమానములొ ఉంటూ , ప్రక్రుతితో మమేకమై ఉండని. 

మనిషి పుట్టింది, తల్లితో (ప్రక్రుతి) మమేకమై , తండ్రిని (దేవుని) తెలుసుకొని దివ్యజేవనము గడపమని.  దివ్యజేవనము అలవాటు కావాలంటె, ప్రక్రుతిపై, దేవునిపై భక్తి ప్రేమ కలగాలి. భక్తి కి వైరాగ్యం కావాలి. వైరాగ్యం సత్కర్మలు,శాకాహారము వల్లనె సాధ్యం.

స్వాగతము

In Uncategorized on అక్టోబర్ 7, 2008 at 6:51 ఉద.

జ్ఞానము – అనగా మన గురించి, కనిపించే ప్రపంచం గురించి,  కనిపించని ప్రపంచం గురించిన సత్యము. ఎంతో విలువైనది. మనకు ఈ సత్యము తెలియకపొతె ఎన్నితెలిసినా సున్న(zero) తొ సమానము. జ్ఞానము  – విజ్ఞానము, అధ్యాత్మికము అనె రెండు విభాగలుగా ఉంది. ఈ రెండు తప్పనిసరిగా మనిషికి అవసరము.

ఈ వెబ్లాగు మీ లో ఆధ్యాత్మికతను పెంచి మిమ్మల్ని పరిపూర్ణ మనవులుగా తిర్చిదిద్దుతుంది.

 • ఇటీవలి జాబులు

 • మూలము

  In జ్ఞానము on నవంబర్ 7, 2008 at 7:09 సా.

  ఆలోచన అన్ని సమస్యలకు, అన్ని అనందాలకు మూలము.ఈ ఆలోచనను మనము మనసు అని పిలుస్తాము. మనసు మంచిదయితే హ్రుదయము అని పిలుస్తాము. అంటె మంచి ఆలోచనలను హ్రుదయము అనవచ్చు.ఆలోచనలను రెండు రకాలుగా గుర్తించవచ్చు.మంచి మరియు చెడు ఆలోచనలు.

  మనము ఏదయినా సమస్యతో భాదపడుతున్నాము అంటె …దానికి సంభందించిన చెడు లేక -ve ఆలోచన నమ మెదడులో లేక శరీరములో ఉందన్నమాట. దీన్ని ధ్యానము లో తొలగిస్తే మీసమస్య చిటికెలో పరిష్కారమవుతుంది.మనసును శుభ్రము చేసుకొని ప్రయంతించండి.

  మనము సమస్య తొలగించుకోవడానికి దైవదర్శనము, సత్గురు దర్శనము , పూజలు మొదలైనవి చేస్తాము. ఎప్పుడైతే మీకు నమ్మకము కలిగిందో మీలో ఉన్న ఆ సమస్యకు సంభందించిన చెడు ఆలోచన లేక -ve తొలగి మీసమస్య పరిష్కార మవుతుంది.

  మంచి ఆలోచనలను హ్రుదయము అని పిలస్తే చెడు ఆలోచనలను మనసు అని పిలవాలి.చిత్రమేమంటె అన్నిఆలోచనలను మనము మనసు అని పిలుస్తాము. మనకు హ్రుదయము గురించి తెలియదు.

  మంచి ఆలోచనలు మనము పెంచుకోకపోతే ..చెడు ఆలోచనలు పెరిగిపోయి మల్లీ రావణుడు , దుర్యొధనుడు..పుడతాడు. ఆ చెడు శక్తిని పూర్తిగా తొలగించడానికి భగవంతుడే మానవరూపము ధరిస్తాడు.

  మనము రోజు శరీరము శుభ్రము చేసినట్లే మన్సుని శుభ్రము చేసి హ్రుదయంగా మార్చాలి. లేకుంటె మనమే రవణావతారమెత్తుతాము.

  చెడు ఆలోచనలౌ లేనివారే ఆత్మస్తితిలోనివారు.వారే భగవంతుని అవతారులు. భగవంతుడు ఎక్కడో లేడు ఇక్కడే మన హ్రుదయము లోనే ఉన్నాడు.విశ్వము భగవంతుని శరీరము .ఆ శరీరములోనే మనమున్నాము.మనము హ్రుదయంగా మారటమే మన లక్శ్యము.